రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ ఏమన్నారంటే?
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికమని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవ్వడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడతుూ ప్రపంచానికి భారత్ ఆశాకిరణమని తెలిపారు. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషిచేయాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.
భారత వస్తువులకు...
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఉంటాయన్న ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. భారత వికాసానికి నూతన సంస్కరణలు అవసరమన్న ఆయన ప్రపంచ దేశాల్లో మన వస్తువులకు గిరాకీ లభిస్తోందని చెప్పారు.