విమాన ప్రమాదానికి అదీ ఒక కారణమేమో?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి శాటిలైట్ భద్రతా వ్యవస్థ లేదని గుర్తించారనితెలిసింది.అజిత్ పవార్ ప్రయాణించే విమానంలో శాటిలైట్ భద్రతా వ్యవస్థ గగన్ లేకపోవచ్చని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
గగన్ లేకపోవడంతోనే...
ల్యాండింగ్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు, గగన్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. కానీ విమానాల్లో గగన్ భద్రతా వ్యవస్థను ఖచ్చితంగా అమర్చాలన్న నిబంధనను పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు. నిబంధనలు అమలులోకి రావడానికి కేవలం ఇరవై ఎనిమిది రోజుల ముందు ఈ విమానం రిజిస్టర్ అయినట్లు తెలిసింది. గగన్ గైడెన్స్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.