రైల్వే టికెట్‌ రద్దు చేసుకుంటే సొమ్ము వచ్చేదెంతంటే.?

రైలులో ప్రయాణమంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని వెళుతుంటారు

Update: 2026-01-29 12:31 GMT

రైలులో ప్రయాణమంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని వెళుతుంటారు. రైలు ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం అని భావించిన ప్రజలు దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతుంటారు. దూర ప్రయాణాలకు వెళ్లాలంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటారు. బెర్ట్ కన్ఫర్మ్ అయితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అందులోనూ లోయర్ బెర్త్ వచ్చిందంటే ఇక చాలు.. సంబరి పడిపోతారు. అలాంటి రైలు ప్రయాణాన్ని హటాత్తుగా మానుకోవాల్సి వస్తే రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవాలంటే రైల్వే శాఖ ఎంత కోత విధిస్తుందోనని కొందరు భయపడతారు.

రద్దు తర్వాత...
ఖరారైన రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు వర్తిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే కనీస రద్దు ఛార్జీ ఫస్ట్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు రూ.240, ఏసీ సెకండ్‌ క్లాస్‌కు రూ 200, థర్డ్‌ ఏసీ, ఏసీ ఛైర్‌కార్, థర్డ్‌ ఏసీ ఎకానమి రూ.180, స్లీపర్‌ క్లాస్‌ రూ.120, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌కు రూ.60 డబ్బులను మినహయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.


Tags:    

Similar News