బాలయోగి నుంచి వైఎస్ .. అజిత్ పవార్ వరకూ... బలితీసుకున్న హెలికాప్టర్లు.. దేశంలో ఎందరో?

భారతదేశంలో అనేక విమాన ప్రమాదాలు ప్రముఖులను పొట్టన పెట్టుకున్నాయి

Update: 2026-01-28 06:11 GMT

భారతదేశంలో అనేక విమాన ప్రమాదాలు ప్రముఖులను పొట్టన పెట్టుకున్నాయి. విమానం కాని, హెలికాప్టర్ కానీ అనేక మంది ప్రముఖుల కుటుంబాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విషాదం నింపింది. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు. గాలిలో వెళుతూ సాంకేతిక లోపం తలెత్తి కూలిపోవడంతో వారి ప్రాణాలు గాలిలోనే కలసి పోతున్నాయి. ఉజ్వలమైన జీవితాన్ని చూడాల్సిన ఎందరో వారు రాజకీయ నేతలు కావచ్చు. సినీ ప్రముఖులు కావచ్చు.. మంటల్లో చిక్కుకుని తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈరోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో అసలు విమానాలు, హెలికాప్టర్లు ఇలా ప్రమాదానికి గురవ్వడానికి గల కారణాలపై చర్చ జరుగుతుంది.

బాలయోగి మృతి...
లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2002 మార్చి 3వ తేదీన బాలయోగి ప్రయాణిస్తున్న హెలికాపర్ట్ కూలి ఆయన మరణించారు. సాంకేతిక లోపం తలెత్తి కొబ్బరి చెట్లను ఢీకొట్టడంతో హెలికాప్టర్ కూలిపోయి బాలయోగి మరణం టీడీపీ నేతలను మాత్రమే కాకుండా అందరినీ కలచి వేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు. 2009 సెప్టెంబరు 2వ తేదీ న కర్నూలు నుంచి 74 కిలోమీటర్లు దూరంలో ఉన్న రుద్రకొండ కొండ సమీపంలో ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ ఆయన మరణించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షం కారణంగానే నియంత్రణ కోల్పోయి హెలికాప్టర్ ప్రమాదానికి గురయింది.
వైఎస్ మరణంతో...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 430. నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్టలో కూలిపోవడంతో వైఎస్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్ పదిహేడో తేదీన కరీంనగర్ వెళుతూ మరణించారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ బయలుదేరిని చాపర్ కూలిపోవడంతో సౌందర్య మృతి చెందింది. సౌందర్య మృతి టాలీవుడ్ లో విషాదం నింపింది. సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమరనాధ్ కూడా మరణించారు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, విమానం నడుపుతూ అది కూలిపోయి 1980లో మరణించారు. ఇక 2001లో కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్న...
వాతావరణం సక్రమంగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021లో తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాపర్ట్ ప్రమాదదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యతో పాటు పన్నెండు మంది దుర్మరణం చెందారు. 2011 లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డోర్జీ ఖండూ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తవాంగ్ సమీపంలో కనిపించకుండా పోయింది. ఐదు రోజుల తర్వాత హెలికాప్టర్ శిధిలాలు లభ్యమయ్యాయి. ఇలా అనేక మంది ప్రముఖులు గాలిలో ప్రయాణిస్తూ సాంకేతికలోపమో.. వాతావరణం సహకరించకో మరణించడం విషాదం నింపింది.






Tags:    

Similar News