భారత్ అన్ని రంగాల్లో దూసుకెళులోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

Update: 2026-01-28 07:00 GMT

గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కలిపించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశంలో నాలుగు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు. అలాగే పేదలకు అవసరమైన గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశామని తెలిపారు. వంద కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందచేశామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు.

తయారీ రంగంలోనూ...
తయారీ రంగంలో భారత్ ముందుందని చెప్పారు. ఇక స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళుతుందని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని చెప్పారు. అంతర్జాతీయంగా కూడా చేసుకున్న ఒప్పందాలు సత్పలితాలనిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. జలజీవన్ మిషన్ ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళుతుందని చెప్పారు.


Tags:    

Similar News