Ajith Pawar : ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూ...అంతా క్షణాల్లోనే... రెండు నిమిషాలు ఆగి ఉంటే?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ కూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ కూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు.బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. జడ్పీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బారామతికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బారామతిలో ఈ విమానం ల్యాండ్ అవుతుండగా క్రాష్ ల్యాండింగ్ అయింది. ఉదయం 8.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. నిన్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముంబయి వచ్చిన అజిత్ పవర్ నేడు బారామతికి వెళ్లి ప్రచారం లో పాల్గొనాల్సి ఉండగా ఆయన వెళుతున్న ఫ్లైట్ కూలి మరణించారు. మరికొద్ది సేపట్లో సభలో ప్రసంగించాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగి ఆయన మరణించడంతో తీవ్ర విషాదం నింపింది.
పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా...
అజిత్ పవార్ పూర్తి పేరు. అజిత్ అనంతరావు పవార్. 1959 22 జూలైవ తేదీన జన్మించారు. మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్ కుటుంబ సభ్యుడైన అజిత్ పవార్. కొన్నాళ్లపాటు ఎన్సీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన అజిత్ పవార్ తర్వాత ఎన్సీపీ నుంచి విడిపోయి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆయన 2024 డిసెంబరు నుంచి మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఈ బాధ్యతను పంచుకుంటున్నారు. శరద్ పవార్ కు చెందిన , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి చీలిపోయిన వర్గానికి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తూ, పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కూడా గతంలో కీలక భూమిక పోషించారు.
షిండే మంత్రివర్గంలోనూ...
గతంలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ 2022 నుండి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ శరద్ పవార్ అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. అతను 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ స్థానం నుండి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
అనేక పదవులు...
అజిత్ పవార్ అనంతరం సుధాకర్‌రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారి భాద్యతలు చేపట్టి ఆ తరువాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు, 1999లో శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఎన్‌సిపి స్థాపించినప్పుడు అతను వెంటే పార్టీలో చేరి అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్-ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా విలాస్‌రావు దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.. అతను ఆ తరువాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా & ఉపముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నింపింది.