మే డే కాల్స్ రాలేదు : డీజీసీఎ

మే డే కాల్స్ రాలేదు : డీజీసీఎ

Update: 2026-01-29 12:37 GMT

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కారణం తెలిపారు.బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్‌ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్‌ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్లియరెన్స్‌ కోసం బారామతి అధికారులను సంప్రదించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో విజిబులిటీ చాలా తక్కువగా ఉండటంతో.. ‘రన్‌వే కనిపిస్తుందా? లేదా? అని పైలట్లను బారామతి అధికారులు అడిగారు.

విజిబిలిటీ లేక విమాన ప్రమాదం...
దీంతో క్లియరెన్స్‌ రాలేదని, ఈ క్రమంలో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్టు మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని అధికారుల ప్రశ్నకు పైలట్లు సానుకూలంగా స్పందించడంతో క్లియరెన్స్‌ ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 8.42 గంటల సమయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించగా.. విజిబులిటీ సమస్యలతోపాటు నియంత్రణ కోల్పోవడంతో రన్‌వేకు దగ్గరగా ఉన్న ఓ బండరాయికి ఢీకొని 8.48గంటల ప్రాంతంలో పెద్ద మంటతో విమానం కూలిపోయినట్లు తెలిపారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో ఎరౌండ్‌ పాటించారని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నట్టు తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్‌ రాలేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News