నేడు పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే
పార్లమెంటు సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి
పార్లమెంటు సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి. ఈరోజు పార్లమెంటు ముందుకు 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రభుత్వం చెబుతుంది.
మీడియా సమావేశంలో...
మధ్యాహ్నం 2.30 గంటలకు చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. భారత్ ఆర్థిక పరిస్థితిపై అనంత నాగేశ్వరన్ దేశ ప్రజలకు వివరించనున్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి సాధించింది? ఆర్థిక పరోగతిని ఏ మేరకు అధిగమించిందన్న దానిపై ఆయన తెలియజేయనున్నారు.