భారత్ లో భారీగా పెరిగిన కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజులో మూడు వేల కేసులకు పైగా పెరిగాయి.
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజులో మూడు వేల కేసులకు పైగా పెరిగాయి. ఒక్కరోజులో 16,906 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 45 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులో 15,447 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.51 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.29 శాతానికి చేరింది.
పాజిటివిటీ రేటు...
పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.68 శాతంగా నమోదయింది. దేశంలో ఇప్పటి వరకూ 5,25,519 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడి 4,30,11,874 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,32,457 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో వ్యాక్సిన్ డోసులు 1,99,12,79,010 వేసినట్లు అధికారులు తెలిపారు.