కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా భాను ప్రకాష్ రెడ్డి

కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా నెల్లూరు జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు

Update: 2026-01-30 12:21 GMT

central election commission

కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా నెల్లూరు జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరుజిల్లాలోని అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యటీ కమిషనర్ గా నియమితులయ్యారు. భాను ప్రకాష్ రెడ్డి రాజస్ధాన్ క్యాడర్ కు చెందిన ఐ ఏ ఎస్ అధికారి.

ఏపీలోనూ పనిచేసి...

రాజస్థాన్ లో 2004 నుంచి ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. డిప్యుటేషన్ పై మన రాష్ట్రంలో కూడా కొంతకాలం పని చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పని చేయడం ఇదే ప్రథమం. దేశంలో అత్యంత కీలకమైన పదవిలో ఆయన నియమితులు కావడం పట్ల నెల్లూరు జిల్లాకు చెందిన ఇందుపూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News