భారత్ లో ఆగని కరోనా.. మళ్లీ ఆంక్షలు తప్పవా?

దేశంలో ఈరోజు 4,0141 కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది మరణించారు.

Update: 2022-06-03 04:08 GMT

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. గత కొద్ది రోజులుగా రెండు వేలు లోపే నమోదవుతున్న కరో్నా కేసులు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రధానంగా మహారాష్ట్రలోనే ఈ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.

యాక్టివ్ కేసులు....
దేశంలో ఈరోజు 4,0141 కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం నమోదయిన కరోనా కేసులు 4,31,68,585 గా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,24,651 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 21,177 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 4,26,22,757గా ఉంది. పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 1,93,83,72,365 వ్యాక్సినేషన్ డోసులు వేశారు


Tags:    

Similar News