Ayodhya ; అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
అయోధ్య వెళ్లే భక్తులకు ఆలయ ట్రస్ట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. దర్శన వేళలను మార్చింది
అయోధ్య వెళ్లే భక్తులకు ఆలయ ట్రస్ట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. దర్శన వేళలను మార్చింది. అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. ఈ మేరకు అయోధ్య రామాలయ ట్రస్ట్ ఈ మేరకు ప్రకటించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఈ మార్పులు చేశారు.
దర్శన వేళల్లో మార్పు...
భక్తులు ఇబ్బంది పడకుండా, వచ్చిన భక్తులకు దర్శనం కలిగించేలా ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి వెయిట్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్ణయించిన ప ప్రకారం భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.