లైట్ గా తీసుకుంటే అంతే.. ఫోర్త్ వేవ్ ముప్పు

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Update: 2022-08-05 04:29 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 20,551 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 70 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా వైరస్ ను లైట్ గా తీసుకోవడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం వల్లనే కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఫోర్త్ వేవ్ కు దారితీసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

వ్యాక్సిన్ వేసుకున్నా....
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదయింది. నిన్న ఒక్కరోజులోనే 21,595 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 4,40,40,362 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 4,34,45,624 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 5,26,600 మంది మరణించారు. ఇక యాక్టివ్ కేసులు ప్రస్తుతం భారత్ లో 1,35,364 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుందని, తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News