వైరస్ వేగం పెంచింది

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. వరసగా నాలుగో రోజు కూడా దేశంలో 20 వేల కేసులు నమోదయ్యాయి.

Update: 2022-07-17 04:23 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. వరసగా నాలుగో రోజు కూడా దేశంలో 20 వేల కేసులు నమోదయ్యాయి. ఇది ఆందోళన కల్గించే అంశం. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. తాజాగా ఒక్కరోజులో 20,528 మంది కరోనా బారిన పడ్డారు. 49 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో 17,790 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం 98.47 శాతంగా నమోదయిందని తెలిపారు.

మరణాలు....
అయితే యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4,37,50,599 కరోనా వైరస బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 4,30,81,441 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,25,709 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,43,449 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News