పాజిటివిటీ రేటు పెరుగుతోంది
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది.
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలను హెచ్చరించినా పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు. తాజాగా కొత్తగా 18,930 కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. 35 మంది కరోనా కారణంగా మరణించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
యాక్టివ్ కేసులు...
మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,457 గా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 5,25,305 మంది మరణించారు. కరోనా బారిన పడి 4,29,21,977 మంది ఇప్పటి వరకూ కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ శాతం 4.32 కు పెరిగింది.