డేంజర్ బెల్స్.. కరోనా కల్లోలం
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వరసగా ఇరవై వేల కేసులు నమోదవుతున్నాయి.
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వరసగా ఇరవై వేల కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థిితి తలెత్తిందని చెప్పకతప్పదు. ఒక్క రోజులోనే 20,044 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. 56 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 18,031 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ దేశంలో 4,37,30,071 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా 5,25,660 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,30,63,651 గా నమోదయింది. ప్రస్తుతం భారత్ లో 1,40,760 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం 98.49 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు కూడా 0.32 శాతం వరకూ నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.