అలర్ట్... కరోనా కమ్ముకొస్తోంది

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 20,408 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-07-30 05:16 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 20,408 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 20958 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే భారత్ లో రికవరీ రేటు 98.48 శాతం గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

మరణాలు మాత్రం...
మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కల్గిస్తుంది. దేశంలో ఇప్పటి వరకూ 4,40,00,138 కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,33,30,442 మంది కోలుకున్నారు. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,26,312 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,43,384 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Tags:    

Similar News