లక్షకు దిగువన యాక్టివ్ కేసులు

భారత్ లో కరోనా కేసుల తీవ్రత కొంత తగ్గింది. ఒక్కరోజులోనే 11,539 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

Update: 2022-08-21 05:45 GMT

భారత్ లో కరోనా కేసుల తీవ్రత కొంత తగ్గింది. ఒక్కరోజులోనే 11,539 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా కారణంగా 49 మంది మరణించారు. యాక్టివ్ కేసులు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.23 గా నమోదయింది. కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

వ్యాక్సిన్ విధిగా....
దేశంలో ఇప్పటి వరకూ 44,339,429 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,37,12,218 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,27,332 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 99,879 యాక్టివ్ కేసులున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా వాక్సిన్ వేయించుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News