అలర్ట్.. కరోనా కేసులు పెరుగుతున్నాయ్
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొనసాగుతుంది. చాలా రోజుల తర్వాత రెండోరోజు కూడా ఇరవై వేల కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కొనసాగుతుంది. చాలా రోజుల తర్వాత రెండోరోజు కూడా ఇరవై వేల కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 20,038 కరోనా కేసుల నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఒక్కరోజులో కరోనా కారణంగా 47 మంది మరణించారు. కోవిడ్ నుంచి నిన్న 16,994 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం తగ్గుతుండటం, రోజువారీ పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళన కల్గిస్తుంది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో కోలుకునే వారి సంఖ్య 98.49 శాతం గా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.31గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,25,604 మంది మరణించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 4,30,45350 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ లో 1,39,073 యాక్టివ్ కేసులున్నాయి.