భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా

భారత్ లో తాజాగా 3,714 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-06-07 05:18 GMT

భారత్ లో కేసులు స్వల్పంగా తగ్గాయి. నమోదయిన కేసులు నాలుగు వేలకు దిగువపైనే ఉన్నాయి. దేశంలో తాజాగా 3,714 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 2,513 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. కరోనా కేసుల నమోదులో హెచ్చు తగ్గుదల ఉన్నప్పటికీ నాలుగోవేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,85,049 గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 5,24,708 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 26,976 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోలన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో 4,26,33,365 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 1,94,27,16,543 డోసుల వ్యాక్సిన్ వేశారు.


Tags:    

Similar News