భారత్ లో కరోనా అప్‌డేట్
ఒక్కరోజులోనే భారత్ లో 9,436 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కరోనా కారణంగా మరణించారు.
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. క్రమంగా ఈ వైరస్ భారత్ ను వదిలి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తికావస్తుండటంతో వైరస్ తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కరోజులోనే భారత్ లో 9,436 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులోనే 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే యాక్టివ్ కేసుల శాతం 0.20 శాతం మేర తగ్గింది.
రికవరీ రేటు...
ఇక రికవరీ రేటు 98.62 శాతానికి పెరగడం కొంత ఊరట కలగించే అంశం. ఇప్పటి వరకూ దేశంలో 4,44,08,132 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,37,93,787 మంది వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనాతో 5,27,754 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 5,27,754 యాక్టివ్ కేసులున్నాయి. 2.11 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా పంపిణీ చేశారు.