భారత్ లో భారీగా తగ్గిన కేసులు

ఒక్కరోజులో 13,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 20 మంది కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-07-12 04:24 GMT

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇది కొంత ఊరట కల్గించే అంశమనే చెప్పాలి. ఒక్కరోజులో 13,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 20 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులో 13,265 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకునే వారి శాతం 98.50 శాతానికి పడిపోయింది. అలాగే రోజువారీ పాజటివిటీ రేటు కూడా 3.23 శాతానికి పడి పోయింది. ఇది కొంత శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.

కోలుకునే వారు...
ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడి 4,29,96,427 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. భారత్ లో 5,25,474 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 1,31,043 గా ఉన్నాయి. ఇక వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ 1,99,00,59,536 కరోనా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News