వామ్మో ఇన్ని కేసులా?
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తుంది
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 20,557 మంది వైరస్ బారిన పడ్డారు. 44 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 19,216 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వైరస్ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని, లేకుంటే కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 1,46,323 కేసులున్నాయి. ఇప్పట ివరకూ దేశంలో 4,39,59,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,32,86,787 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,26,211 గా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వ్యాక్సిన్ ను 203.21 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.