భారత్ లో భారీగా తగ్గిన కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 13,754 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 34 మంది మరణించారు

Update: 2022-08-02 04:49 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే 13,754 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 34 మంది మరణించారు. గత పది రోజులుగా కరోనా వైరస్ కేసులు అతి తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 17,897 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.49 శాతంగా నమోదయింది.

మరణాలు....
భారత్ లో ఇప్పటి వరకూ 4,40,50,009 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,33,83,787 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,26,430 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ లో 1,39,792 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 204.60 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News