భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో నిన్న 4,270 మందికి కరోనా వైరస్ సోకింది. పదిహేను మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య తగ్గినా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సంఖ్య పెంచాలని, నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
పాజిటివిటీ రేటు....
దేశంలో నిన్న ఒక్క రోజు 2,619 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 4,31,76,817 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,24,692 మంది మరణించారు. ప్రస్తుతం 24,052 యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,28,072 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ నివారణకు భారత్ లో 1,94,09,46,157 డోసులు వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు