ఇండియా కరోనా అప్‌డేట్

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2022-07-22 05:08 GMT

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 21,880 మంది దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనాతో 60 మంది మరణించారు. కోవిడ్ నుంచి నిన్న 21,219 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం 98.46 శాతంగా నమోదయింది. ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రమాదకరం కాదని భావించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దని పేర్కొంటుంది.

కోవిడ్ నిబంధనలను...
మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడంతోనే వైరస్ ను దూరం చేయవచ్చని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,38,47,065 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,49,482 యాక్టివ్ కేసులున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటివరకూ కరోనా బారిన పడి 4,31,71,653 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి దేశ వ్యాప్తంగా 5,25,930 మంది మరణించారని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News