22nd భారత్ లో కరోనా అప్‌డేట్

భారత్ లో కరోనా కేసులు దేశంలో తగ్గుతుండటం, పెరుగుతుండటం గత కొద్ది రోజులుగా జరుగుతుంది.

Update: 2022-09-22 05:30 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కరోనా కేసులు దేశంలో తగ్గుతుండటం, పెరుగుతుండటం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ఒక్కరోజులోనే 5,443 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ కారణంగా 26 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 24 గంటల్లో 5,291 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 98.71 శాతం రికవరీ రేటుగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.10 శాతంగా నమోదయింది.

మరణాల సంఖ్య....
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,53,042 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,78,271 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో కరోెనా కారణంగా 5,28,429 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 46,342 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2,17,11,36,934 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News