భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులో 9,531 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-08-22 04:21 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా భారత్ ను వణికిస్తున్న కరోనా కొంత శాంతించినట్లే కనపడుతుంది. ఒక్కరోజులో 9,531 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 36 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే రికవరీ రేటు శాతం 98.59 శాతానికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం మంది హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.

వ్యాక్సినేషన్ తో...
ఇక దేశంలో ప్రస్తుతం 0.22 యాక్టివ్ కేసుల శాతం నమోదయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం గా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 44,348,960 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ 4,37,23,944 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,27,368 మంది మరణించారు. ప్రస్తుతం 97,648 యాక్టివ్ కేసులు భారత్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.


Tags:    

Similar News