భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2022-07-27 05:33 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 18,313 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 57 మంది మరణించారు. మరణాలు పెరగడంపై కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజులోనే కరోనా నుంచి 20,742 మంది కోలుకోవడం కొంత ఊరట కల్గించే పరిణామం.

రికవరీ రేటు....
కరోనా రికవరీ రేటు 98.47 శాతం గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ 4,39,38,764 మంది కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో 4,32,67,571 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారినపడి 5,26,167 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,45,026 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News