భారత్ లో భారీగా పెరిగిన కేసులు
భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గత కొన్ని రోజులుగా రెండు వేలకు మించని కరోనా కేసులు నేడు మూడు వేలు దాటాయి
భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గత కొన్ని రోజులుగా రెండు వేలకు మించని కరోనా కేసులు నేడు మూడు వేలు దాటాయి. ఇది ఆందోళనకల్గించే పరిణామమే. తాజాగా కొత్తగా 3,712 మంది భారత్ లో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐదుగురు కరోనాతో మరణించారు. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
పాజిటివిటీ రేటు....
కరోనా నుంచి 2,500 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,64,544 నమోదయినట్లయింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,24,641 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4,26,20,394 గా ఉంది. కోలుకునే వారి సంఖ్య 98.74 శాతం గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పెరిగింది.