భారత్ లో భారీ సంఖ్యలో కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 3 నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

Update: 2022-06-08 05:04 GMT

భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. నిన్న 5,233 మందికి దేశ వ్యాప్తంగా కరోనా సోకింది. ఒక్కరోజులోనే ఏడుగురు మరణించారు. అయితే కోలుకున్న వారి సంఖ్య కొంత ఆశాజనకంగా ఉంది. కోవిడ్ బారిన పడి నిన్న 3,345 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోలుకునే వారి శాతం 98.72 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

పాజిటివిటీ రేటు....
దేశంలో ఇప్పటి వరకూ 4,31,90,282 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,24,715 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 28,857 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. 4,26,36,710 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటి వరకూ 1,94,43,26,416 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.


Tags:    

Similar News