భారత్ లో భారీగా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గినట్లే కన్పించినా ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి.

Update: 2022-07-20 05:35 GMT

భారత్ లో ఈరోజు కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గినట్లే కన్పించినా ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఇది ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులో 20,557 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనాతో 40 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి సంఖ్య శాతం 98.47 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

అప్రమత్తంగా లేకుంటే....
ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,091గా ఉంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,38,03,619 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇందులో 4,31,32,140 మంది కోలుకున్నారని అన్నారు. ఇక ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,388 మంది మరణించారు.


Tags:    

Similar News