తగ్గుతున్న కరోనా.. అయినా వీడని భయం

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేసులు తగ్గుతున్నా మాత్రం మరణాల సంఖ్య పెరుగుతోంది.

Update: 2022-08-13 04:29 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేసులు తగ్గుతున్నా మాత్రం మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 15,815 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 68 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య ఎక్కువ కావడం ఆందోళన కలగిస్తుంది. ఇక నిన్న ఒక్కరోజులోనే 20,018 మంది కోలుకున్నారని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రివకరీ రేటు ప్రస్తుతం భారత్ లో 98.54 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.27 శాతంగా నమోదయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

యాక్టివ్ కేసులు...
ఇక దేశంలో ఇప్పటి వరకూ 4,42,39,372 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,35,73,094 మంది చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,26,996 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 1,19,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వ్యాప్తి విస్తృతంగా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News