భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 18,738 కరోనా కేసులు నమోదయ్యాయి.

Update: 2022-08-07 04:30 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 18,738 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయింది. నిన్న కోవిడ్ బారిన పడి 18,558 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నిబంధనలను అమలయ్యేలా చూడాలని సూచించింది.

యాక్టివ్ కేసులు....
దేశంలో ఇప్పటి వరకూ 4,40,78,506 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 4,34,84,110 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,26,689 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News