గుడ్ న్యూస్.. కేసులు తగ్గుతున్నాయ్

దేశంలో వరసగా రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 15,528 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-07-19 05:02 GMT

దేశంలో వరసగా రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 15,528 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 25 మంది కరోనా కారణంగా మరణించారు. కేసులయితే తగ్గుతున్నాయి కాని దేశంలో యాక్టివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొంది తిరిగి కోలుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సోకే వైరస్ ప్రమాదకరమైనదేమీ కాకపోవడంతో కొంత ఊరట అనిపిస్తున్నా కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ డోసులు...
నిన్న ఒక్కరోజులో 16,113 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోలుకున్న వారి శాతం 98.47 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య శాతం మాత్రం 0.33 శాతంగా నమోదయింది. ప్రస్తుతం దేశంలో 4,37,83,062 మంది ఇప్పటి వరకూ కరోనా బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 4,31,13,623 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకూ 5,25,785 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 1,43,654 ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమయింది. బూస్టర్ డోస్ కు అనుమతివ్వడం, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్ లు వేయడంతో డోసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం భారత్ లో కరోనా వ్యాక్సిన్ డోసులు సంఖ్య 200.5 దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News