భారత్ లో భారీగా కేసులు

భారత్ లో మళ్లీ భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 17,703 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-06-27 04:14 GMT

భారత్ లో మళ్లీ భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 17,703 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 21 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే ఒక్కరోజులో కరోనా బారి నుంచి 15,208 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకునే వారి శాతం 98.57 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

జాగ్రత్తలు తీసుకోకుంటే...
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా వ్యాప్తి మరింత వేగంగా జరుగుతుందని వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరికలు ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకూ భారత్ లో 4,34.07,046 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,25,020 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 94,420కి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,27,87,606 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News