ఆగని కరోనా...ఒక్కరోజులోనే?
భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక్కరోజులోనే 20,409 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 32 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 22,697 మంది కోలుకున్నారు. అయితే రోజువారీ రికవరీ రేటు శాతం 98.48 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ భారత్ లో 4,39,79,730 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 4,33,09,484 కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,26,258 మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం భారత్ లో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా వైరస్ మరింత తీవ్రమయ్యే అవకాశముందన్న ఆందోళన వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.