భారత్ లో తగ్గని కరోనా

భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులో 19,406 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-08-06 05:27 GMT

భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులో 19,406 కరోనా కేసులు నమోదయ్యాయి. 49 మంది కరోనా కారణంగా మరణించారు. కేసుల సంఖ్య తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కోవిడ్ నిబంధనలను అమలు పర్చే విషయంలో సీరియస్ నెస్ గా లేవు. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్ నిబంధనలను....
ప్రజలు కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రజల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోలుకునే వారి సంఖ్య పెరుగుతుంది. నిన్న ఒక్కరోజులోనే 19,928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ శాతం 98.50 శాతంగా ఉంది. భారత్ లో ఇప్పటి వరకూ 4,40,59,768 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 4,34,65,552 కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,26,649 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,34,793 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల శాతం 0.31 శాతంగా ఉంది.


Tags:    

Similar News