భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 16,047 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది

Update: 2022-08-10 05:32 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 16,047 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా 54 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఒక్కరోజులోనే 19,539 కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ రోజు వారీ రికవరీ రేటు 98.52 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.29 శాతంగా నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

కేంద్రం అప్రమత్తం....
4,41,90,697 కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదయ్యాయి. వీటిలో 4,35,35,610 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,26,826 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,28,261 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.


Tags:    

Similar News