దేశంలో కనుమరుగవుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులో భారత్ లో 5,439 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభపరిణామం. ఒక్కరోజులో భారత్ లో 5,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 22,031 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.62 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.
వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.15 శాతంగా నమోదయింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,15,723 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,25,024 కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 65,732 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 212 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.