భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులో భారత్ లో 8,586 మంది కరోనా బారిన పడ్డారు.
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇది కొంత ఊరట కల్గించే అంశమే. రెండు రోజుల నుంచి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో భారత్ లో 8,586 మంది కరోనా బారిన పడ్డారు. 48 మంది కరోనాతో మరణించారు. ఒక్కరోజులోనే 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.59 శాతంగా నమోదయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. యాక్టివ్ కేసుల శాీశాతం 0.22 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ...
దేశంలో ఇప్పటి వరకూ 4,43,57,546 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ 4,37,33,624 చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,27,416 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 96,506 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మూడు డోసుల వ్యాక్సినేషన్ ను తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అలాగే కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.