భారత్ లో స్థిరంగా కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 13,272 మంది కరోనా బారిన పడ్డారు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 13,272 మంది కరోనా బారిన పడ్డారు. 36 మంది కరోనా కారణంగా మరణించారు. దాదాపు పది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.23 శాతంగా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరణాలు కూడా....
ఇక దేశంలో ఇప్పటి వరకూ 4,43,27,890 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,36,99,435 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,27,289 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,01,166 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వకూ 2.09 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.