భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు

రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసులు మళ్లీ భారీగా దేశంలో పెరిగాయి. తాజాగా 12,249 మంది కరోనా బారిన పడ్డారు.

Update: 2022-06-22 05:23 GMT

గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసులు మళ్లీ భారీగా దేశంలో పెరిగాయి. తాజాగా 12,249 మంది కరోనా బారిన పడ్డారు. పదమూడు మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజు కరోనా బారిన పడి 9,862 మంది కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.62 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 3.94 శాతంగా నమోదయింది.

కోలుకునే వారి సంఖ్య....
దేశంలో ఇప్పటి వరకూ 43,331,645 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 5,24,903 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో 81,687 యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత్ లో 1,96,45,99,906 వ్యాక్సిన్ డోసులు వేశారు.


Tags:    

Similar News