భారత్ లో పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజులోనే 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 30 మరణించారు

Update: 2022-06-29 05:38 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజులోనే 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 30 మరణించారు. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 11,574 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.56 శాతం ఉంది. మరణాల రేటు కూడా తక్కువగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుంది. ఇప్పటికే యాక్టివ్ కేసుల రోజు వారీ శాతం 0.23 శాతంగా నమోదయింది.

యాక్టివ్ కేసులు....
భారత్ లో ఇప్పటి వరకూ 4,34,33,345 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,25,077 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99,602కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,28,08,666 గా ఉంది. వ్యాక్సిన్ డోసులు భారత్ లో 1,97,46,57,138 వేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News