తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. తాజాగా 9,923 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 17 మంది మరణించారు

Update: 2022-06-21 05:50 GMT

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. తాజాగా 9,923 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 17 మంది మరణించారు. నిన్న కరోనా నుంచి 7,293 మంది కోలుకున్నారు. కోలుకునే వారి శాతం పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కల్గిస్తుంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది.

మరణాల సంఖ్య....
భారత్ లో ఇప్పటి వరకూ 4,33,19,396 కరోనా వైరస్ బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,24,890 మంది మరణించారు. కరోనా బారిన పడి 4,27,15,193 కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 1,96,32,43,003 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న కూడా భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.


Tags:    

Similar News