లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గాయి. ఒక్కరోజులో 11,793 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-06-28 04:18 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గాయి. ఒక్కరోజులో 11,793 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 27 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులో 9,486 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి శాతం భారత్ లో 98.57 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.22 శాతంగా ఉంది.

తగ్గిన కరోనా కేసులు..
ఇప్పటి వరకూ భారత్ లో 4,34,18,839 కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,047 మంది మరణించారు. భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 96,700 వరకూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,27,97,092 మంది కోలుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది.


Tags:    

Similar News