భారత్ లో కేసులు తగ్గినా...మరణాలు...?
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 3,962 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 3,962 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఆశించిన తగ్గుదల కాదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 26 మంది చనిపోయారు. మరణాల సంఖ్య పెరగింది. ఐదు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న కరోనా నుంచి కోలుకుని 2697 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్న వారి శాతం 98.74 శాతంగా నమోదయింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ....
దేశంలో ఇప్పటి వరకూ 4,31,72,547 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 5,24,677 మంది ఇప్పటి వరకూ మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 22,416 గా ఉంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,26,25,454గా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ 1,93,96,47,071 వ్యాక్సిన్ డోసులు వేశారు.