స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,899 మంది వైరస్ బారిన పడ్డారు. 15 మంది కరోనాతో మరణించారు.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,899 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 15 మంది కరోనాతో మరణించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకూ 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కల్గిస్తున్నప్పటికీ, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతుండటం కొంత ఊరట కల్గించే అంశమని వైద్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ.....
భారత్ లో ఇప్పటి వరకూ 4,32,96,692 మంది కరోనా బారిన పడ్డారు. 5,24,855 మంది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,99,363 దేశంలో కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 72,474కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశంలో 1,96,14,88,807 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు. కేసుల సంఖ్య పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ఫోర్త్ వేవ్ తప్పదని హెచ్చరిస్తున్నారు.