భారత్ లో పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 8,822 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పదిహేను మంది మరణించారు

Update: 2022-06-15 04:20 GMT

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 8,822 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పదిహేను మంది మరణించారు. కరోనా కేసులు ప్రతి రోజు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణంగా కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిన్న 5,718 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.66 గా ఉండటం కొంత ఊరట కల్గించే అంశం.

యాక్టివ్ కేసులు....
ఇక భారత్ లో ఇప్పటి వరకూ 43,245,517 కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 5,24,792 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 53,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,67,088 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం చేశారు. ఇప్పటి వరకూ 1,95,50,87,271 కరోనా డోసులు అందించారు.


Tags:    

Similar News