పెరిగిన యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతిరోజూ 20 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతిరోజూ 20 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 21,411 మందికి కరోనా వైరస్ సోకింది. 67 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోలుకునే వారి శాతం 98.46 శాతంగా నమోదయింది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజువారీ పాజిటివిటీ రేటు...
రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో 4,38,68,476 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,997 మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4,31,92,379 గా ఉంది. ప్రస్తుతం భారత్ లో 1,50,100 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.